మీర్​ ఆలం చెరువుపై కేబుల్ ​బ్రిడ్జి

మీర్​ ఆలం చెరువుపై కేబుల్ ​బ్రిడ్జి
  • జూపార్కులోకి స్కైవాక్ కనెక్టివిటీ
  • పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్లాన్
  • ఔత్సాహిక నిర్మాణ కంపెనీలకు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో మరో కేబుల్​బ్రిడ్జిని నిర్మించాలని హెచ్ఎండీఏ ప్లాన్​చేస్తోంది. ఇప్పటికే ఐటీ కారిడార్​లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సిటీకి ఐకాన్​గా మారింది. ఇదే తరహాలో పాతబస్తీలోని మీర్​ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దుర్గం చెరువుపై 233 మీటర్ల మేర రూ.184 కోట్ల ఖర్చుతో ఆరు లేన్ల(ఒక్కో వైపు మూడు లేన్లు) రోడ్లతో కేబుల్​బ్రిడ్జిని నిర్మించగా, మీర్​ఆలం చెరువుపై 2.65 కి.మీ.

మేర బెంగళూరు హైవే(ఎన్ హెచ్44) నుంచి చింతల్​మెట్​రోడ్​వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ కూడా ఆరు లేన్ల(ఒక్కో వైపు మూడు లేన్లు) రోడ్లను ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్​నర్​షిప్(పీపీపీ)లో చేపట్టేందుకు ప్లాన్​చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయితే మీర్​ఆలం లేక్ పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. మరోపై ట్రాఫిక్ సమస్యకు చెక్​పడనుంది. అలాగే జూపార్కుకు వచ్చే సందర్శకుల కోసం కేబుల్ బ్రిడ్జిని ఆనుకుని డెక్​అండ్​స్కైవాక్ కనెక్టిటీ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆయా కంపెనీల నుంచి రిక్వెస్ట్​ఫర్ ప్రపోజల్ పిలిచారు. ట్రాన్సాక్షన్​అండ్​అడ్వయిజర్​కమ్​ ఏరియా డెవలప్​మెంట్​ప్లాన్​కోసం అధికారులు కన్సల్టెంట్ ను నియమించారు. ఆరు లేన్ల బ్రిడ్జి, మీర్​ఆలం చెరువు బ్యూటిఫికేషన్, లేక్​ఫ్రంట్​డెవలప్​మెంట్, ఇతర సౌకర్యాల కల్పన పనులను పీపీపీ పద్దతిలో చేపట్టడానికి టెక్నికల్, ఫైనాన్షియల్​ బిడ్స్​ను ఆగస్టు 5వ తేదీలోపు అందజేయాలని ఆయా కంపెనీలను అధికారులు కోరారు. 

బీఓటీ పద్ధతిలో.. 

ఈ ప్రాజెక్ట్​ను బిల్డ్​ఆపరేట్​ట్రాన్స్​ఫర్(బీఓటీ) పద్ధతిలో నిర్మించేందుకు ముందుకు వచ్చే కంపెనీల ఎన్నికలో హెచ్ఎండీఏకు ట్రాన్సాక్షన్​ అడ్వయిజర్​కమ్ ఏరియా డెవలప్​మెంట్ ప్లాన్​ కన్సల్టెంట్స్​సహరిస్తారు. ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ లేక్​ డెవలప్​మెంట్, టూరిజం, సైకిల్​ట్రాక్స్, పెడస్ట్రియన్​ట్రాక్స్​పై కొన్ని డిజైన్లను అధికారులకు సమర్పించింది.

త్వరలో ఓవరాల్ లేక్​ డెవలప్​మెంట్​పై కన్సల్టెంట్ సంస్థ ఆయా కంపెనీలకు డిజైన్​కాంపిటీషన్ నిర్వహించనుంది. కంపెనీల నుంచి అందే డిజైన్లు, ప్రతిపాదనలను బట్టి అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా ఫొటోలను హెచ్ఎండీఏ గురువారం విడుదల చేసింది.