
మహబూబ్ నగర్/నాగర్ కర్నూల్: కేరళ నుంచి తీసుకొచ్చిన కేడావర్ జాగిలాలు 12 ప్రదేశాలను గుర్తించాయి. అక్కడ మృతదేహాలు ఉన్నట్టు రెస్క్యూ టీం భావిస్తోంది. గతంలో ఎన్జీ ఆర్ఐ మార్కింగ్ చేసి ప్లేస్ లనే కేడావర్ డాగ్స్ కూడా గుర్తించడం గమనార్హం. జాగిలాలు అదే ప్రదేశం వరకు వెళ్లి తిరిగి వచ్చాయి.
ప్రస్తుతం రోబోటిక్ సర్వే కొనసాగుతోంది. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కూడా టన్నెల్ లో పరిశీలనలు చేస్తున్నారు. 14 రోజుల క్రితం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడంతో ఎనిమిది మంది చిక్కుకు పోయారు. వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇవాళ ( March 7) ఉదయం 11 గంటల తర్వాత రోబోటిక్ టీమ్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ టన్నెల్ లోకి వెళ్లారు. వందలాది మంది కార్మికులు రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తున్నారు. బురదను తొలగిస్తున్న క్రమంలో కొత్తగా అదే స్థాయిలో ఊట వస్తుండటం.. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియక పోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.