SLBC టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు కేడావర్ డాగ్స్

SLBC టన్నెల్లో మృతదేహాలను గుర్తించేందుకు కేడావర్ డాగ్స్

SLBC టన్నెల్లో మృతదేహాలను వెలికితీత ప్రక్రియ వేగవంతం చేశారు అధికారులు. వీలైనంత త్వరగా మృతదేహాలను బయటికి తీసేందుకు కేరళనుంచి ప్రత్యేకంగా 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో 2 కేడావర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. IIT నిపుణులతో సాయంతో క్యడావర్ డాగ్స్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లా యి. డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నేతృత్వంలో టన్నెల్ చిక్కుకున్న వారిని గుర్తించేందుకు చర్యలు వేగవంతం చేశారు. 

వయనాడు ల్యాండ్ స్లైడింగ్లో కేడావర్ డాగ్స్ ప్రముఖ పాత్ర పోషించాయి. కొండ చెరియల లోపల కురుకపోయిన మృతదేహాల గుర్తించాయి స్పెషల్ డాగ్స్. టన్నెల్ ముందు భాగంలో మట్టిలో కొరుకుపోయిన క్యాబిన్లో కార్మికుల అవశేషాలు గుర్తించేందుకు కేడావర్ డాగ్స్ రంగంలోకి దించారు అధికారులు.  

Also Read :- హకీంపేట ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై హైకోర్టులో పిటిషన్

ఒక చివరనుంచి మట్టిని మరో చివర నుంచి నీటిని దారి మళ్లిస్తూ ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ముందుకు సాగుతున్నాయి. టన్నెల్ లోపల పనిచేసేవారికి కావలసిన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్.డి.ఆర్.ఎఫ్. అధికారులు, సింగరేణి అధికారులు, ఐ. ఐ టి నిపుణులు తదితరులు కూడా రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలిస్తున్నారు.