
హైదరాబాద్, వెలుగు: టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాడీ క్లాష్ గోల్ఫ్ మూడో ఎడిషన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గోల్ఫ్ అసో సియేషన్ (హెచ్‌జీఏ) గోల్ఫర్లు సత్తాచాటారు. హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్‌లో సోమవారం జరిగిన ఈ టోర్నీలో వివిధ సంస్థలకు చెందిన140 మంది క్యాడీలు పోటీ పడ్డారు.
లాంగెస్ట్ డ్రైవ్‌లో హెచ్‌జీఏకు చెందిన సల్మా (321 యార్డ్స్) విజేతగా నిలవగా.. కల్యాణ్ (బీఈపీటీఏ–306 యార్డ్స్) రన్నరప్‌గా నిలిచాడు. స్ట్రెయిటెస్ట్ డ్రైవ్ లో బీఈపీటీఏకు చెందిన పవన్, శివ తొలి రెండు స్థానాలకు కైవసం చేసుకున్నారు. క్లోసెస్ట్ టు ది పిన్‌లో హెచ్‌జీఏ క్యాడీలు ముకేష్, సావూద్ టాప్–2 ప్లేస్‌లు సాధించగా.. కేటగిరీ 1 – గ్రాస్ విజేతగా మహేష్ నిలిచాడు.
టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి, ఎమ్మార్ ప్రాపర్టీస్ పీజీఎస్‌ఈకు చెందిన మధుసూదన్ రావు విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.