న్యూఢిల్లీ: వైరల్ ఇన్‌ఫెక్షన్ ఇన్‌ఫ్లూ యెంజా (ఫ్లూ ‑ జలుబు) ను నిరోధిం చేందుకు క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ సోమవారం ఓ వ్యాక్సిన్ లాంచ్ చేసింది. క్వాడ్రివలెంట్ కాడిఫ్లూ టెట్రా వ్యాక్సిన్‌ను పెద్దలు, చిన్న పిల్లలు వాడొచ్చని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చిందని వివరించింది.
ఇన్‌ప్లూయెంజాలో సబ్‌టైప్ ఏ, బీ లోని నాలుగు రకాల వైరస్‌లను ఈ వ్యాక్సిన్ టార్గెట్ చేస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను గర్భిణులు కూడా వేసుకోవచ్చని క్యాడిలా ఫార్మా పేర్కొంది.