Health Alert: మన శరీరంలో కాల్షియం తగ్గితే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ

Health Alert: మన శరీరంలో కాల్షియం తగ్గితే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విటమిన్ లోపమో..శరీరానికి సరిపడా ఖనిజ లవణాలు లేకనో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. దాదాపు అందరూ బి-12, సి విటమిన్, ఐరన్ లోపం, కాల్షియం లోపం వంటి విటమిన్, మినరల్ డిఫిసియెన్సీ(Vitamin & Mineral Deficiency Diseases)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

విటమిన్లు, మినరల్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, రోజువారీ కార్యక్రమాలను సవ్యంగా సాగించడంలోనూ ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. చాలామంది ఇది విటమిన్, మినరల్ లోపమే కదా.. ఏంకాదులే అని అశ్రద్ధ వహిస్తుంటారు. అయితే విటమన్, మినరల్స్ డిఫిసియెన్సీ కూడా ప్రమాదమే అంటున్నారు డాక్టర్లు.. ముఖ్యంగా కాల్షియం డిఫిసియెన్సీ వల్ల ప్రాణాలు తీసే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయం టు న్నారు డాక్టర్లు. 

ALSO READ | Health tips:బరువు తగ్గాలనుకుంటున్నారా..6 బెస్ట్ డ్రింక్స్

కాల్షియం అసమతుల్యత అంటే..చాలా తక్కువ కాల్షియం (hypocalcemia), చాలా ఎక్కువ కాల్షియం (hypercalcemia) రెండూ గుండెకు హాని కలిగిస్తాయి..దాని లయను దెబ్బతీస్తాయి..సమర్థవంతంగా పని చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. లక్షణాలను గుర్తించడం, గుండెపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తమ హృదయనాళ వ్యవస్థను రక్షించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలని సూచిస్తున్నారు. 

కాల్షియం సాధారణంగా ఎములక బలాన్ని కాపాడటం, మెరుగుపర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు ఈ ఖనిజం కండరాల పనితీరు, నరాల ప్రసరణతో పాటు అత్యంత క్లిష్టమైన గుండె ఆరోగ్యంతో సహా అనేక శారీరక విధుల్లో కీలకంగా పనిచేస్తుంది. కాల్షియం స్థాయిలు అసమతుల్యమైనప్పుడు ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.