రాజన్న ఆదాయం రూ.1.55కోట్లు

వేములవాడ, వెలుగు : రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరింది. 21 రోజుల హుండీలను ఆలయ ఓపెన్​ స్లాబ్​ లో ప్రత్యేక బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. రూ.కోటి 55 లక్షల, 427 రూపాయల నగదుతో పాటు 258 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి వచ్చిందని ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్​ తెలిపారు. ఆలయ ఉద్యోగులు, శివరామకృష్ణ భజన మండలి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.