జూనియర్ డాక్టర్ల దీక్షకు మద్దతుగా నిర్ణయం
కోల్ కతా: బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ డాక్టర్ రేప్, మర్డర్ నేపథ్యంలో డాక్టర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి మద్దతుగా డాక్టర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం కోల్కతాలోని మెడికల్ కాలేజీకి చెందిన 60 మంది సీనియర్ డాక్టర్లు తమ రాజీనామాలను సమర్పించారు. అంతకు ముందే మంగళవారం ఆర్జీకర్ ఆస్పత్రికి చెందిన 50 మంది సీనియర్ డాక్టర్లు ఒకేసారి రాజీనామా చేశారు. వీరంతా రాజీనామా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ మాత్రం బాధితురాలికి న్యాయం చేస్తామని, డాక్టర్లందరూ నిరసన విరమించి విధుల్లో చేరాలని కోరారు. ‘‘డాక్టర్లందరూ విధుల్లో చేరి ప్రజలకు సేవలు అందించాలి. వారికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు.