చిరుతదాడిలో లేగదూడ మృతి

చిరుతదాడిలో లేగదూడ మృతి
  • నారాయణపేట జిల్లా మోమిన్ పూర్ శివారులో ఘటన

మద్దూరు, వెలుగు: చిరుత దాడిలో లేగదూడ చనిపోయిన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. మద్దూరు మండలం మోమిన్ పూర్ శివారులో గూళ్ల హన్మంతు రోజూ మాదిరిగానే తన పొలం వద్ద మంగళవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చి చూడగా చిరుత లేగ దూడను చంపి తిన్న ఆనవాళ్లు కనిపించాయి. అతను వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ కు సమాచారం ఇచ్చాడు.  వెళ్లి చిరుత ఆనవాళ్లను గుర్తించాడు. 

గత ఫిబ్రవరి16 న అదే ఏరియాలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో చనిపోగా ఫారెస్ట్ ఆఫీసర్లు శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ ఇంకా రాలేదని బుధ వారం అదే ప్రాంతంలోబోను,  ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేసినట్టు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.