బస్సు ఢీ కొట్టిందంటూ లేగ దూడను బస్సుకు కట్టి హంగామా

బస్సు ఢీ కొట్టిందంటూ లేగ దూడను బస్సుకు కట్టి హంగామా

మరిపెడ, వెలుగు: లేగ దూడను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందంటూ ఖమ్మం– వరంగల్ హైవేపై మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా వద్ద గిరిజనులు బస్సును అడ్డుకున్నారు. అనంతరం లేగ దూడను బస్సుకు కట్టేసి బస్సు ముందుకు పోకుండా ఆపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లేగ దూడకు పెద్దగా దెబ్బలు తగలకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు గిరిజనులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి బస్సును ముందుకు పోనిచ్చారు.