అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బంది చిన్న చిన్న మంటలను అదుపులోకి తెస్తున్నా.. పెద్ద మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు మొదలై వారం రోజులు గడుస్తున్నప్పటికీ రోజుకింత పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. బలమైన గాలుల కారణంగా బుధవారం ఆ మంటలు మరింత తీవ్రతరం అవుతాయని అంచనా.
మంగళవారం నాటికి లాస్ ఏంజిల్స్ మంటల్లో మరణించిన వారి సంఖ్య 25కి చేరుకుంది. దాదాపు 30 మంది తప్పిపోగా.. వేలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 12,000 భవనాలు ధ్వంసమయ్యాయి. కార్చిచ్చు వల్ల ఎంతో మంది కట్టు బట్టలతో ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.
ALSO READ | జనవరి 9వ తేదీ ఇంత దరిద్రమైన రోజా.. ఆ రోజు ప్రపంచంలో ఏం జరిగిందంటే..?
లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ నివాసితులను ఎమర్జెన్సీ ఇంకా ముగియలేదని హెచ్చరించారు. బలమైన మంటలను ఎదుర్కోవడానికి లాస్ ఏంజెల్స్‌లోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అగ్నిమాపక దళాలను మోహరించారు.