
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా ట్రస్మా మాజీ అధ్యక్షుడు సొల్లేటి రాజారెడ్డి మృతికి సంతాపంగా శనివారం ప్రైవేట్ స్కూల్స్ బందుకు పిలుపునిచ్చినట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షులు రాజేంద్రపాణి, బత్తిని దేవన్న ఓ ప్రకటనలో తెలిపారు. అనారోగ్య కారణాలతో శుక్రవారం చనిపోయిన రాజారెడ్డి డెడ్‌బాడీకి జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నాయకులు నివాళులర్పించారు.
రాజారెడ్డి 30 ఏండ్లపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల సమస్యలు తీర్చడానికి ఎంతగానో కృషిచేశారని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా, మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్షుడిగా పదవులు చేపట్టి ప్రైవేటు పాఠశాలల సంఘ అభివృద్ధికి దోహదపడ్డారని తెలిపారు. శనివారం బంద్‌కు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు సహకరించాలని కోరారు.