పోలీసులు పట్టించుకోలే: కాల్ మనీ టార్చర్… బెజవాడలో యువకుడి ఆత్మహత్య

పోలీసులు పట్టించుకోలే: కాల్ మనీ టార్చర్… బెజవాడలో యువకుడి ఆత్మహత్య

కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి ఉండవల్లి సెంటర్ సమీపంలోని బకింగ్ హామ్ కాలువలో దూకి ప్రేమ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తూపాకుల మహేష్ అంటూ సెల్ఫీ విడియోలో చెప్పాడు ప్రేమ్. ఆరు లక్షలకు 16 లక్షలు కట్టానంటూ సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. విజయవాడ పటమట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల ముందే.. కాల్ మనీ గ్యాంగ్ కులం పేరుతో దూషించినా పట్టించుకోలేదన్నాడు. బకింగ్ హామ్ కాలువ దగ్గరకు చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బుల కోసం తమను వేధించారని..  కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తూపాకుల మహేష్ ను కఠినంగా శిక్షించాలని కోరారు.