కాల్ రేట్లు ఇండియాలోనే తక్కువ

కాల్ రేట్లు ఇండియాలోనే తక్కువ
  • కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ఫోన్​ కాల్‌ రేట్లు భారత్​లోనే ఉన్నాయని టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇండియాలో ప్రస్తుతం 117 కోట్ల మొబైల్ కనెక్షన్లు, 93 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. బుధవారం లోక్​సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రతి నిమిషానికి కాల్ ఖర్చు 53 పైసలుగా ఉండేదని, అది ఇప్పుడు 93 శాతం తగ్గి 3 పైసలకు చేరుకుందని చెప్పారు. 

ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ధరలలో ఒకటని పేర్కొన్నారు. ఒక జీబీ డేటాకు రూ.9.12 ఖర్చు అవుతుందని.. ఇది ప్రపంచంలోనే అత్యంత చవక అని వివరించారు. ‘‘భారత్​లో మార్చి 2024 నాటికి 954.4 మిలియన్ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్లు ఉంటే అందులో   398.35 మిలియన్లు రూరల్ ఇంటర్నెట్ సబ్‌‌‌‌స్క్రైబర్లు ఉన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్​ ఇండియా విలేజస్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 2024 నాటికి దేశంలోని 6,12,952 గ్రామాలు 3జీ, 4జీ మొబైల్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. 95.15% గ్రామాలకు ఇంటర్నెట్ ఉంది”అని వెల్లడించారు.