ఇండియాలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ పరీక్ష కోసం ఏళ్ల తరబడి ప్రిపెర్ అవుతారు. మరికొందరు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకుంటారు. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి.. ఇంటర్వ్యూలో కూడా పాస్ కావాలంటే చిన్న మాటేం కాదు. ఎవరైన ఐఏఎస్ లేదా ఐపీఎస్‌గా ఎంపికయ్యారంటే వారికిచ్చే గౌరవ మర్యాదలే వేరు. లక్షల్లో పోటీ పడే ఈ ఉద్యోగాలు వందల్లో మాత్రమే పోస్టులు ఉంటాయి. ఇలాంటి గ్రేట్ జాబ్ చేసే వారు ఊరికి ఒక్కరు ఉంటేనే ఘనం.. అలాంటిది ఒకే పల్లెటూరిలో 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా సెలక్టయ్యారంటే అది ఎక్కడో అని మనమందరం తెలుసుకోవాలి.
ALSO READ : ఇంటర్నేషనల్ పోటీల్లో భీమదేవరపల్లి చిన్నారులకు మెడల్స్
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో మాధోపట్టి అనే గ్రామంలో ఏకంగా 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికై వివిధ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కవ మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచిపోయింది. దాదాపు 75 ఇళ్లు ఉండే గ్రామంలో ఓ ఇంట్లో నలుగురు అన్నదమ్ముల్లు ఉండగా.. వాళ్లందరు కూడా ఐఏఎస్ అధికారులు కావడంతో ఆ గ్రామానికి మరింత పేరు వచ్చింది. అందుకే ఈ ఊరిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. యూపీ రాజధాని లక్నోకి 300 కి.మీ ఉండే మాధోపట్టికి దగ్గర్లో కోచింగ్ సెంటర్లు కూడా లేవు. అంతే కాదు గవర్నమెంట్ జాబ్స్ ఏ కాదు వ్యాపారం, స్పేస్, అణు పరిశోధన, బ్యాంకింగ్, న్యాయ సేవలు వంటి రంగాలు ప్రముఖులు ఈ గ్రామంలో ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమకారుడైన ఠాకూర్ భగవతి దిన్ సింగ్, అతని భార్య శ్యామరాతి సింగ్ 1917లో ఇక్కడి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. పండగలు వస్తే చాలా ఎస్ కాట్ వాహనాలతో ఈ ఊరంతా నిండిపొంది.