బషీర్ బాగ్, వెలుగు: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్‌లో ఆగస్టు 1న ఆటోల బంద్‌కు షేక్ హ్యాండ్ డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లా ఖాన్ పిలుపునిచ్చారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు.
పదేండ్లుగా మీటర్ చార్జీలు పెంచలేదని, ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ. 12 వేల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టడంతోపాటు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.