స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : కొందరు నాయకులు ఆరుద్ర పురుగుల్లా వచ్చి పోతుంటరు, స్థానిక నినాదంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చా’ అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం అక్కపల్లిగూడెంలో బీటీ రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను స్థానికుడిని అయినందునే నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ రవి, అక్కపల్లిగూడెం సర్పంచ్ కడుదుల జ్యోతినర్సిరెడ్డి, ఇప్పగూడెం సర్పంచ్ జక్కుల పరశురాములు, బీఆర్‌ఎస్ లీడర్లు జూలకుంట్ల రాజశేఖర్‌రెడ్డి, యార కొమురెళ్లి, ప్రసాద్ పాల్గొన్నారు.