దొంగతనానికి వచ్చి..ఫాస్ట్ఫుడ్ డబ్బా కిందపడి చనిపోయాడు..

అనుదొక్కటి.. అయింది ఒక్కటి.. అంటే ఇదే కావొచ్చు.. దోచుకెల్దామని వచ్చిన దొంగ ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు.. దొంగతనానికి వచ్చి ప్రమాదవశాత్తు ఫాస్ట్ ఫుడ్ డబ్బా మీదపడి అక్కడికక్కడే  మృతిచెందాడు. మధురానగర్ పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే...

హైదరాబాద్ లోని మధురానగర్ పీఎస్ పరిధిలో శనివారం ఆగస్టు24, 2024 అర్థరాత్రి చోరీకోసం వచ్చిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. ఎల్లారెడ్డిగూడ లోని ఆగ్రా స్వీట్ హౌజ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించి.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డబ్బా మీదపడి చనిపోయాడు. ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. డబ్బాను లాగడంతో అది మీద పడి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.