గుడిలో దొంగతనానికి వచ్చి అడ్డంగా దొరికిపోయిండు..

వరంగల్ చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగ భీబత్సం సృష్టించాడు. అర్థరాత్రి ఆలయంలో దొంగ తనానికి పాల్పడ్డాడు. దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో అర్థరాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. ఈ క్రమంలోనే స్థానికులు అతన్ని గుర్తించి పట్టుకున్నారు. 

గుడిలోని స్తంభానికి కట్టేసి చితకబాది.. స్థానిక పోలిసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.