- మహబూబ్‌నర్ జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఘటన
- పోలీసుల అదుపులో ఓ యువకుడు
పాలమూరు, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్బాత్రూమ్లో శనివారం మొబైల్ కెమెరా కలకలం సృష్టించింది. బాత్రూమ్లో కెమెరా ఉన్నట్టు తెలుసుకున్న స్టూడెంట్లు కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. అలాగే, ఈ విషయంపై స్టూడెంట్ల తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్చేశారు. వెంటనే కాలేజ్వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొబైల్‌ఫోన్ నక్క సిద్ధార్థ అనే స్టూడెంట్‌కు చెందినదిగా గుర్తించారు. అతడే కెమెరాను గర్ల్స్ బాత్రూమ్లో పెట్టినట్టు గుర్తించామని మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు.
అనంతరం సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మొబైల్లో ఉన్న డేటాను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం యువకుడిని అరిమాండ్కు పంపిస్తామని వివరించారు. కాలేజీ, స్కూల్స్ వద్ద ప్రతి రోజూ షీ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా స్టూడెంట్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఏబీవీపీ ఆందోళన
జరిగిన ఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు మద్దతుగా కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. కాలేజీల్లో రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో స్టూడెంట్లు భయపడుతున్నారని చెప్పారు. స్టూడెంట్ల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.