మెగాస్టర్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న భోళా శంకర్(Bhola shankar) మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు.. మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా(Thamannaah) హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్(Keerthi Suresh) చిరుకు చెల్లిగా కనిపించనుంది.
ఇక భోళా శంకర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు యూనిట్. ఇందులో భాగంగా ఈ చిత్రానికి కెమెరామెన్ గా చేసిన డడ్లీ(Duddly) మీడియాతో ముచ్చటించారు. భోళా శంకర్ సినిమా గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా డడ్లీ మాట్లాడుతూ.. మోహర్ రమేష్ మన సినిమాలో చిరంజీవి హీరో అని చెప్పగానే షాక్ అండ్ సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యాను. ఆయనతో పనిచేసిన ప్రతి క్షణం చాలా మెమెరబుల్‌గా అనిపించింది. మరీ ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అయితే అవుట్ స్టాండింగ్. టెక్నికల్ విషయాలపై కూడా ఆయనకు మంచి నాలెడ్జ్ వుంది. ఇక భోళా శంకర్ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ ఉంటుంది. అది చాలా పెద్ద సీక్వెన్స్. సినిమా అంతా కూడా చాలా గ్రాండ్‌గా, విజువల్ ట్రీట్ లా ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం చొక్కాలు చించుకోవడం ఖాయం అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు డడ్లీ.
ALSO READ:సినిమాలో ఛాన్స్ .. రా ఏజెంట్‌గా సీమా హైదర్.. ఆడిషన్ కూడా ఇచ్చేసింది!