బిగ్ బాష్ లీగ్ లో ఊహించని ప్రమాదకర సంఘటన ఒకటి జరగడం ఆందోళన కలిగిస్తుంది. శుక్రవారం (జనవరి 3) పెర్త్ స్కార్చర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్ స్టార్ ఆటగాళ్లు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, డేనియల్ సామ్స్ గాయపడ్డారు. వీరి గాయం తీవ్రత కావడంతో అప్పటికప్పుడు హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం వీరి గాయంపై ఎలాంటి సమాచారం లేదు. చూస్తుంటే ఇద్దరు ఆటగాళ్లు ఈ ఆటగాళ్లు ఈ సీజన్ కు దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది. శనివారం ఉదయం వీరు పెర్త్ ఆసుపత్రిలో ఉన్నారు. CT స్కాన్‌ల ఫలితం రావాల్సి ఉంది. వస్తున్న సమాచార ప్రకారం ఇద్దరూ కూడా కనీసం కనీసం 12 రోజుల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే..?
ఇన్నింగ్స్ 16 ఓవర్ లో సిడ్నీ థండర్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ వేసిన లెగ్ సైడ్ బంతిని పెర్త్ ఆటగాడు కొనొల్లి ఫ్లిక్ చేశాడు. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బంతి అక్కడే గాల్లోకి లేచింది. సింపుల్ క్యాచ్ ను అందుకోవడానికి కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, డేనియల్ సామ్స్ చాలా దూరాన్ని కవర్ చేస్తూ వచ్చారు. మిడ్ వికెట్ మీదుగా వచ్చిన ఈ బంతిని బాన్‌క్రాఫ్ట్ అందుకున్నాడనుకున్న సమయంలో మరోవైపు సామ్స్ రావడంతో ఇద్దరు ఢీ కొన్నారు. ఇద్దరూ కూడా వేగంగా రావడంతో పెద్ద గాయం అయింది. ఈ క్రమంలో బాన్‌క్రాఫ్ట్ ముక్కు నుంచి రక్తం వచ్చింది.
ALSO READ | IND vs AUS: స్కానింగ్‌కు బుమ్రా.. గాయంపై ప్రసిద్ కృష్ణ క్లారిటీ
వీరిద్దరిని స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. బాన్‌క్రాఫ్ట్, డేనియల్ సామ్స్ బ్యాటింగ్ చేయలేకపోవడంతో మ్యాచ్ రిఫరీ కంకషన్ రీప్లేస్‌మెంట్ ను ప్రకటించారు. ఓలీ డేవిస్, అన్‌క్యాప్డ్ 20 ఏళ్ల హ్యూ వీబ్‌జెన్ వీరి స్థానాల్లో బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సిడ్నీ థండర్ వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్ పై చివరి బంతికి ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో థండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
That's a very nasty collision between daniel sams and cameron bancroft. Bancroft has a bleedy nose but he's walking off the field with the physio. But Sams is being stretchered out. Hope he is fine. #AUSvIND #BBL #BBL14 pic.twitter.com/itgWExXK8f
— Sara (@tap4info) January 3, 2025