Cameron Green: ప్రియురాలితో ఆస్ట్రేలియా ఆజహానుభాహుడు నిశ్చితార్ధం

Cameron Green: ప్రియురాలితో ఆస్ట్రేలియా ఆజహానుభాహుడు నిశ్చితార్ధం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్టార్ ప్లేయర్.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు. ఆదివారం (ఫిబ్రవరి 16) ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్రికెటర్ ఈ ఆసీస్ ఆజహానుభాహుడు తన చిరకాల ప్రియురాలినితో త్వరలో ఎంగేజ్ మెంట్ వార్తను షేర్ చేసుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ రెడ్‌వుడ్‌తో కలిసి దిగిన రెండు ఫోటోలను షేర్ చేశారు. ఆ జంట తమ నిశ్చితార్థపు ఉంగరంతో పోజులిచ్చారు. ఆ పోస్ట్‌కు ఇలా క్యాప్షన్ ఇచ్చారు: "ఈ అమ్మాయిని ప్రేమించు!! (ఎప్పటికీ)". అనే క్యాప్షన్ ఇచ్చాడు. 

ఎమిలీ రెడ్‌వుడ్ ఒక డైటీషియన్ తో పాటు పీహెచ్‌డీ విద్యార్థిని. చిన్నప్పటి నుంచి గ్రీన్ జీవితంలో ఆమె ఉంది. ఎమిలీ చిన్నప్పటి నుంచీ పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆసక్తిని పెంచుకుంది. ఆ లక్షణమే ఆమెను ఈ రంగంలో కెరీర్‌ను కొనసాగించేలా చేసింది.  ఆహార ప్రణాళికలు, జీవనశైలి మార్పుల ద్వారా వ్యక్తులు తమ ఆరోగ్య లక్ష్యాలను ఎలా పెంపొందించుకోవాలో చెప్పడమే ఆమె ప్రధాన లక్ష్యం.

ALSO READ | MLC 2025 retention list: స్టార్ క్రికెటర్లను పక్కన పెట్టారు: కమ్మిన్స్, హెడ్, మిల్లర్‌లకు ఫ్రాంచైజీ షాక్

ఆస్ట్రేలియా జట్టులో గ్రీన్ ప్రధాన ఆల్ రౌండర్. ఈ యువ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియాలో పేరు గాంచిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడుతూ గ్రీన్ గాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా గ్రీన్ ఇటీవలే భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో   రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 18 కోట్ల రూపాయాలు కొనుగోలు చేసింది. గాయం కారణంగా మరో నెల రోజుల్లో జరగబోయే ఐపీఎల్ కు దూరం కానున్నాడు. 25 ఏళ్ళ గ్రీన్ ఆస్ట్రేలియా తరపున 28 టెస్టులు, 28 వన్డేలు, 13 టీ20 మ్యాచ్ లు ఆడాడు.