బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ భారత్ తో జరగబోయే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ధృవీకరించింది. ఇటీవలఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ఆడుతున్నప్పుడు గ్రీన్ గాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా గ్రీన్ శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. దీని ప్రకారం ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కు 6 నెలల విరామం అవసరం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు శ్రీలంక టూర్ ఆ తర్వాత జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా అర్హత సాధిస్తే ఆ సమయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.అంతకముందు గాయం కారణంగా గ్రీన్ స్పెషలిస్ట్ బ్యాటర్ గానే బరిలోకి దిగుతాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఈ సుదీర్ఘ సిరీస్ కు దూరం కానున్నాడు. ఆల్ రౌండర్ గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడకపోతే ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే.
సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.
Cameron Green has sustained a back injury during Australia's recent tour of the United Kingdom. Reports have confirmed that the all-rounder has suffered a stress fracture and will undergo surgery.
— CricTracker (@Cricketracker) October 14, 2024
As a result, he will miss the upcoming five-match Test series against India and is… pic.twitter.com/6jd6SvTxp0