జామెట్రీ బాక్స్ సృష్టికర్త కన్నుమూత.. నివాళులతో హోరెత్తిన సోషల్ మీడియా

చిన్నప్పుడు మనకు ఎంతగానో ఉపయోగపడిన కిట్ కనిపెట్టిన వ్యక్తి ఇక లేరు.. ఆ కిట్ తో మనం మ్యాతమెటిక్స్.. సైన్స్ లో ఎన్నో సార్లు ఉపయోగించాం.. ఇంతకు ఎంటా కిట్.. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా అయితే పూర్తిగా చదవండి.. స్కూల్ చదవిటప్పుడు మనకు ఎంతో ఉపయోగపడిన  జామెట్రీ క్యామ్లిన్ బాక్స్.. ఆ బాక్స్ ను కనుకొన్న వ్యక్తి సుభాష్ దండేకర్ మృతి చెందాడు.

Also Read:- ఈ ఫొటోలో ఉన్న గది అద్దె రూ.10 వేలు.. కిటికిలు కూడా లేవు..

 ముంబై ఆయన తుది శ్వాస విడిచారు. కామ్లిన్‌ను 1931లో DP దండేకర్ మరియు అతని సోదరుడు GP దండేకర్ స్థాపించారు.   "హార్స్ బ్రాండ్" ఇంక్ పౌడర్‌లు మరియు టాబ్లెట్‌లతో ప్రారంభించబడి ఈ సంస్థ 1946లో ఒక ప్రైవేట్ సంస్థగా మారింది 1998లో పబ్లిక్‌గా మారింది.  ఇంటర్నెట్ గురించి పిల్లలకు అంతగా తెలియని రోజుల్లో ఈ జ్యామెట్రికల్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడేది.  

 90- 20 పీరియడ్ లో పుట్టిన పిల్లలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది.  అయితే ఈ విషయం తెలుసుకున్న  నైన్టీ  కిడ్స్ తమ సానుభూతిని తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు.