ఇన్​స్పిరేషన్ : క్యామ్లిన్​ఓ మధుర జ్ఞాపకం

జనరేషన్​ జెడ్​కు క్యామ్లిన్​ ఓ మధుర జ్ఞాపకం. వాళ్ల జీవితాలను కళాత్మకంగా
మార్చడంలో క్యామ్లిన్​ ముందుంది. ఒకప్పుడు ప్రి–స్కూల్​కు వెళ్లే పిల్లలు వాడే
క్రేయాన్‌‌‌‌‌‌‌‌ల నుండి ప్రైమరీ స్కూల్​ పిల్లలు ఎగ్జామ్స్​ రాయడానికి వాడే 
డిపెండబుల్ క్యామ్లిన్ పెన్సిల్స్, టీనేజర్ల స్టేషనరీ బాక్స్‌‌‌‌‌‌‌‌లో ఉండే 
మృదువైన క్యామ్లిన్ పెన్నుల వరకు అన్నీ ప్రత్యేకమైనవే.  

యంగ్​ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ దిగంబర్ పరశురామ్ దండేకర్​కు చదువు పూర్తి కాగానే రైటింగ్​ ఇంక్​ బిజినెస్​ చేయాలనే ఆలోచన వచ్చింది. అతని అన్న గోవింద్ దండేకర్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో ఇంజనీర్​గా పనిచేసేవాడు. గోవింద్​ సాయంతో పరుశురామ్1931లో దండేకర్ అండ్​ కో అనే కంపెనీ పెట్టాడు. దాన్నే తర్వాత క్యామ్లిన్​ అని మార్చారు. అప్పట్లో ఈ కంపెనీలో ఇంక్ పౌడర్‌‌‌‌‌‌‌‌ తయారు చేసి, అమ్మేవాళ్లు. ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ క్వాలిటీగా ఉండడంతో కొన్నాళ్లకు అమ్మకాలు బాగా పెరిగాయి.  ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. కానీ.. అదే టైంలో ట్యాక్స్​ అడ్జెస్ట్‌‌‌‌మెంట్స్​ వల్ల ఇంపోర్ట్‌‌‌‌ చేసుకున్న ఇంక్​ లోకల్​ ఇంక్​ కంటే చౌకగా దొరకడంతో మార్కెట్​ సవాళ్లను ఎదుర్కొంది.

మొదట్లోనే నష్టాలు

పెద్ద కంపెనీలు ఇంపోర్ట్ చేసుకున్న ఇంక్​ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు ఉండేవి. కానీ..  లోకల్​ ఇంక్​ని తయారు చేసే చిన్న కంపెనీలకు ఎలాంటి రాయితీలు ఇచ్చేవాళ్లు కాదు. దాంతో ఖర్చులు బాగా పెరిగాయి. ధర కూడా పెరిగింది. ప్రజలు చౌకగా దొరికే దిగుమతి చేసుకున్న ఇంక్‌‌‌‌ను కొనడం మొదలుపెట్టారు. దాంతో పరశురామ్​ వ్యాపారాన్ని ఆపేయాలి అనుకున్నాడు. కానీ.. అప్పటివరకు తన దగ్గర ఇంక్​ కొంటున్నవాళ్లు కొందరు ‘ధర ఎక్కువైనా పర్వాలేదు కొంటామ’నే హామీ ఇవ్వడంతో కంపెనీ నడిపించాడు. 

1946లో కంపెనీగా

ముందు ఇంక్​ మాత్రమే తయారుచేసిన కంపెనీలో తర్వాత ఫౌంటెన్ పెన్నులు, బలపాలు కూడా తయారుచేశారు. తర్వాత ఒక్కొక్కటిగా దాదాపు అన్ని రకాల స్టేషనరీ ప్రొడక్ట్స్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. 1946లో ఒక ప్రైవేట్ కంపెనీగా ఏర్పడింది. 1964 నాటికి  అన్ని రకాల పెయింట్స్, కాన్వాస్‌‌‌‌లు, పెయింట్ బ్రష్‌‌‌‌లను తన ప్రొడక్ట్స్​ జాబితాలో చేర్చుకుంది. తర్వాత జామెట్రీ బాక్స్​లను కూడా తీసుకొచ్చింది. 

ముందుకు సాగుతుంది

మహారాష్ట్రలోని ఒక మారుమూల పట్టణమైన తారాపూర్​లో 1974లో పూర్తి ఆటోమేటెడ్ ప్లాంట్​ ఏర్పాటు చేసింది . అక్కడి నుంచి చెక్కతో చేసిన పెన్సిళ్లను ఉత్పత్తి​ చేసింది. పెన్సిళ్ల ఉత్పత్తి కంపెనీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది.1984లో డ్రగ్స్, ఫార్ములేషన్స్ లాంటి ఫార్మాస్యూటికల్స్​ ప్రొడక్షన్‌‌‌‌లోకి కూడా అడుగుపెట్టింది.1987లో హై–పాలిమర్ తయారీకి ప్లాంట్‌‌‌‌ ఏర్పాటు చేసింది. అందుకోసం ‘పైలట్ పెన్ కో. లిమిటెడ్’ అనే జపనీస్ కంపెనీ సాయం తీసుకుంది. 

కొకుయో

క్యామ్లిన్ కంపెనీ 2012లో ఒక కొత్త గుర్తింపు పొందింది. కొకుయో ఎస్​అండ్​టీ లిమిటెడ్​ అనే జపాన్​ కంపెనీ క్యామ్లిన్‌‌‌‌ కంపెనీలో మెజారిటీ వాటా కొన్నది. ఈ జపాన్​ కంపెనీ దాదాపు వందేండ్లుగా ఈ వ్యాపారంలో ఉంది. 

పోటీలు 

ఇండియాలోని చాలా స్కూళ్లలో పిల్లల టాలెంట్​గుర్తించేందుకు కంపెనీ ‘ఆలిండియా క్యామ్లిన్’​ పోటీలు పెట్టేది. ఈ పోటీల కోసం ఎంతోమంది ఎదురు చూసేవాళ్లు. అంతేకాదు.. విజేతలకు  క్యామ్లిన్ నుండి సర్టిఫికెట్ కూడా ఇచ్చేవాళ్లు. ఈ పోటీని గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దేశవ్యాప్తంగా 48.5 లక్షల మంది స్టూడెంట్స్​ పాల్గొన్న ఈ పోటీని అతిపెద్ద ఆర్ట్​ కాంపిటీషన్​గా గుర్తించింది. క్యామ్లిన్ తన మొదటి ప్రి–స్కూల్‌‌‌‌ను 2009లో ముంబైలో మొదలుపెట్టి మరో మైలురాయిని దాటింది. అప్పటి నుండి కంపెనీ మరో మూడు ప్రి–స్కూళ్లను స్థాపించింది. ప్రస్తుతం పెన్నులు, పెన్సిళ్లతోపాటు జామెట్రీ బాక్స్‌‌‌‌లు, నోట్‌‌‌‌బుక్స్​, పెయింట్స్​, ఫైల్స్​, ఫోల్డర్స్, పర్మినెంట్​ మార్కర్లతో పాటు అన్ని రకాల ఆఫీస్ స్టేషనరీ అమ్ముతోంది.

కంపెనీ నుంచి ఆర్ట్​ మెటీరియల్స్​ తీసుకురావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 1948లో మహాత్మా గాంధీ హత్యకు గురైనప్పుడు ఆయన చిత్రపటాన్ని గీయడానికి ఒక కళాకారుడిని నియమించారు. అతను ఆర్ట్ మెటీరియల్ అడిగినప్పుడు విన్సర్ న్యూటన్ కలర్స్​, కాన్వాస్ ఇచ్చారు. స్వదేశీ ఉద్యమం నడిపించిన మహనీయుడిని బొమ్మ గీయడానికి ఇంపోర్ట్‌‌‌‌ చేసుకున్న వస్తువులను వాడడం దురదృష్టకరమని ఆ కంపెనీ చైర్మన్​ సుభాష్ దండేకర్‌‌‌‌ అనుకున్నాడు. అందుకే కంపెనీ నుంచి ఆర్ట్‌‌‌‌ మెటీరియల్స్​ తీసుకొచ్చారు.