కోల్బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 14,15 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ఆరు గ్యారంటీలను వివరించారు. వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండస్ట్రీలనుతీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, సీనియర్ లీడర్ ఎండీ అబ్దుల్ అజీజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, లీడర్లు పలిగిరి కనకరాజు, పూల్లూరి కళ్యాణ్, కనకం వెంకటేశ్వర్లు, అఫ్జల్లాడెన్ తదితరులు పాల్గొన్నారు.