పచ్చ కర్పూరం చాలా సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్ని గానీ వెన్నతో గానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళు బైర్లు కమ్మడం, తలతిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమట పట్టడం తగ్గుతాయి.
పచ్చ కర్పూరాన్ని మూడు పూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటే బలం, రక్తపుష్టి కలుగుతుంది. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. కంటిజబ్బులు, రక్తస్రావాన్ని అరికడతాయి..ఏ మందుతోనైనా ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది.. వేసవికాలంలో పచ్చకర్పూరం తీసుకుంటే వడదెబ్బ, అతి దాహం, తపన, శరీరం చిటపటలాడటం, శోష వంటివి తగ్గిపోతాయి.
ALSO READ | Good Health : ప్లానెటరీ హెల్త్ డైట్ అంటే ఏంటీ.. భోజనంలో ఏం తినాలి.. ఏం తగ్గించుకోవాలి..!
బీపీ వున్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బీపీ పెరగకుండా అరికడుతుంది.కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, ఎరుపెక్కడం, నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి..
పచ్చకర్పూరం, జాజికాయ,జాపత్రి ఈ మూడింటిని మెత్తగా నూరి, దాంట్లో ఎండుద్రాక్షవేసి మాత్రలాగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని, పాలు తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది.
-వెలుగు, లైఫ్-