ట్రైబల్​ ఏరియాల్లో సికిల్​సెల్​ నివారణకు 19 నుంచి క్యాంపులు

 ట్రైబల్​ ఏరియాల్లో సికిల్​సెల్​ నివారణకు 19 నుంచి క్యాంపులు

భద్రాచలం, వెలుగు : సికిల్​సెల్ అనీమియా వ్యాధి నివారణకు ఈనెల19 నుంచి జులై 3 వరకు ట్రైబల్​ ఏరియాల్లో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు మినిస్టరీ ఆఫ్ ట్రైబల్​వెల్ఫేర్ జాయింట్ ​సెక్రటరీ జయ తెలిపారు. గిరిజనులు తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని సూచించారు. న్యూఢిల్లీ నుంచి సోమవారం కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో వీడియో కాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు.

గర్భిణీలు, గిరిజన పిల్లల కోసం స్పెషల్​క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లు, పీహెచ్​సీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రోజువారీ నివేదికలు పంపించాలని స్పష్టం చేశారు.  ఉమ్మడి భద్రాద్రి జిల్లాలో 50 ఆశ్రమ పాఠశాలలు, 23 పీహెచ్​సీలు, 30 హాస్టళ్లలో క్యాంపులు పెడుతున్నట్లు కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ వివరించారు.