![Vastu Tips : కొండలపై ఇల్లు కట్టుకోవచ్చా..? కట్టుకుంటే వాస్తు పాటించాలా.. !](https://static.v6velugu.com/uploads/2025/02/can-a-house-be-built-on-hills-follow-vastu--details-here_MjuViC3HTw.jpg)
సొంతిల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు. కాని ప్రస్తుత రోజుల్లో స్థలం దొరకడం చాలా కష్టతరంగా మారింది. కొండలు.. గుట్టలు.. ఎత్తైన ప్రదేశాల్లో అయినా ఓ చిన్నపాటి ఇంటిని నిర్మించుకొని జీవివచాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ క్రమంలో వాస్తు ప్రకారం ఎలాంటి పద్దతులు అవలంభించాలో వాస్తు నిపుణులు కాశీనాథుని సుబ్రమణ్యం గారి సూచనలకు ఒకసారి తెలుసుకుందాం. .
ప్రశ్న : ఊరికి కొంచెం దూరంలో200 గజాల స్థలం లో ఉంది. అదంతా కొండ ప్రాంతం... అక్కడ వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. మొత్తం ఎత్తు వంపులుగా ఉన్న ప్లాట్ తీసుకోచ్చా.. సహజంగా కొండ ప్రాంతం కావడం వల్ల రాళ్లు, రప్పలతో ఉంటుది. అలా ఉన్న స్థలాన్ని తీసుకోవడం మంచిదేనా? దానివల్ల ఏమైనా దోషాలుంటాయా? ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చా..?
జవాబు: ఈ ఒక్క స్థలమే కాదు... ఈమధ్య గుట్టలు, కొండలు ఉన్న ప్రాంతాన్ని వెంచర్లు చేస్తున్నారు. ఖాళీ స్థలం ఎత్తు వంపులు ఉన్నా పర్వాలేదు. కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం నేలను సమానం చేసుకోవాలి. అలాగే ఒక కాంపౌండ్లోని స్థలం ఎప్పుడూ గ్రౌండ్ లెవల్లోనే ఉండాలి. కొండలున్న స్థలం కాబట్టి, సమానం చేయడం కష్టమవుతుందంటే మాత్రం... దక్షిణం, పశ్చిమ దిక్కులో ఎత్తుగా.. తూర్పు, ఉత్తర దిక్కుల్లో కాస్తంత వంపుగా ఉండొచ్చు. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు.
గుట్టల మీద ఇల్లు కట్టుకుంటే... ఆ ఇంట్లోవాళ్లకు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇండిపెండెంట్ ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ అపా ర్ట్ మెంట్ అలా ఎత్తు వంపుల స్థలం మీద కట్టినా పర్వాలేదు. ఎందుకంటే... అందులో ఫ్లాట్లలో ఉం దేవాళ్లంతా పై ఫోర్లలోనే ఉంటారు కదా. కింద ఎలాగూ స్థలాన్ని సెల్లారుగా వదిలేస్తారు. వాళ్లకు ఇబ్బంది ఉండదు. కొండలపై ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుంటే మాత్రం వాస్తు ప్రభావం ఉంటుంది. వాస్తు శాస్త్రం పండితులను సంప్రదించి.. సూచనలు, సలహాలు తీసుకుని ఆ ఇంటి నిర్మాణం చేసుకుంటే మంచిది.