AI పిన్ వచ్చేస్తుంది.. స్మార్ట్ ఫోన్లు మాయం.. ఇవి ఎలా పని చేస్తాయంటే..!

AI పిన్ వచ్చేస్తుంది.. స్మార్ట్ ఫోన్లు మాయం.. ఇవి ఎలా పని చేస్తాయంటే..!

టెక్నాలజీ విప్లవం నడుస్తుంది. అందులోనూ ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మనుగడను మార్చేస్తుంది. ఏదీ శాశ్వతం కాదు.. అది కూడా జీవితం కాలం కాదు.. జస్ట్ మూడు, నాలుగు సంవత్సరాల్లోనే అంతా మార్చేస్తుంది టెక్నాలజీ. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లోనే స్మార్ట్ ఫోన్లు మాయం కాబోతున్నాయా.. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా చాలా ఆసక్తిగా.. సీరియస్ గా నడుస్తున్న చర్చ. దీనికి కారణం లేకపోలేదు.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్.. ఇప్పుడు వీటిని  AI పిన్ అని పిలుస్తున్నారు.. అత్యంత వేగంగా వీటిపై పరిశోధనలు జరగటమే కాదు.. ట్రయిల్ రన్ బయటకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. 

AI పిన్ అంటే ఏంటీ.. ?

చాలా చాలా చిన్న పరికరం ఇది. మన చొక్కాలకు నేమ్ ప్లేట్ అంత సైజ్ లో ఉంటుంది. ఈ ఏఐ పరికరాన్ని మనకు కావాల్సినట్లు.. వివిధ మోడల్స్ లో తయారు చేస్తారు. ఆ AI పిన్ ను మన చొక్కాకు పెట్టుకుంటే చాలు.. అందులోనే సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ అన్నీ ఉంటాయి. కాల్ వస్తే ఎలా మాట్లాడతాం అంటారా.. ఫోన్ రింగ్ కాగానే మన చేతిపైన కూడా దాన్ని చూసుకోవచ్చు.. ఎవరు కాల్ చేశారు.. నెంబర్ ఏంటీ అనేది డిస్ ప్లే గా కనిపిస్తుంది. చేతిపై చూడొచ్చు లేదు గోడపైనా.. టేబుల్ పైనా.. ఎక్కడైనా సరే వర్చువల్ గా కనిపిస్తుంది. ఆ వెంటనే మా వాయిస్ ఆధారంగా ఆ కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా.. వాయిస్ కమాండ్ ద్వారా డిసైడ్ చేసుకోవచ్చు. ఇదంతా గూగుల్, ఇతర మొబైల్ నెట్ వర్క్ కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనకు ఏం కావాలన్నా సరే నోటితో చెబితే చాలు.. మాటల్లో సమాధానం ఇస్తుంది.. డిస్ ప్లే గా చూపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ ఎలా పని చేస్తుందో.. సేమ్ టూ సేమ్ అలాగే ఈ AI పిన్ డివైజ్ పని చేస్తుంది. 

మెసేజ్ ఎలా చేస్తారు.. ఫొటోలు ఎలా తీసుకుంటాం.. మ్యూజిక్ ఎలా వింటాం.. సినిమా ఎలా చూస్తాం.. అనే డౌట్స్ రావొచ్చు.. డోంట్ వర్రీ.. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ కంటే చాలా బెటర్ గా.. క్వాలిటీగా ఇవన్నీ చేసి పెడుతుందంట. ఆ చిన్న AI పిన్ లోనే శక్తివంతమైన కెమెరాతోపాటు వాయిస్ ఆధారంగా పని చేసే అన్ని ఆప్షన్స్ ఉన్నాయంట..

2024లో ఈ AI పిన్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఇయర్ లక్ష యూనిట్లు అమ్మాలని టార్గెట్ పెట్టుకుంది కంపెనీ.. దీని ధర 60 వేల రూపాయల నుంచి ప్రారంభం కావొచ్చు అని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. 

ఇంతకీ దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు అంటారా..  ఇమ్రాన్ చౌదరి. యాపిక్ కంపెనీ డిజైనింగ్ లో స్టీవ్ జాబ్స్ తో కలిసి పని చేశారు. ప్రస్తుతం హుమానీ అనే స్టార్ అప్ కంపెనీ ద్వారా.. ఈ ప్రాడక్ట్ కోసం ఐదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే 240 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికి ఓ రూపం వచ్చింది. 2024లో AI పిన్ రిలీజ్ కాబోతుంది. 

ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చింది అంటే చాలు.. ఎగబడి కొనటానికి జనం ఎటూ ఉంటారు.. సో.. 2025 నాటికి స్మార్ట్ ఫోన్ అనేది మాయం కావటం ఖాయం అంటూ ఇప్పటికే ఇంటర్నెట్ హోరెత్తుతుంది. చూడాలి ఇమ్రాన్ చౌదరి విజన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.. ఎందుకంటే ఆయన యాపిల్ కంపెనీని నిలబెట్టిన వారిలో ఒకరు కదా.. 

ALSO READ :- ప్రపంచంలో ఫస్ట్ టైం : బాయ్స్ హాస్టల్స్ మధ్య.. స్టూడెంట్స్ క్రాకర్ ఫైటింగ్