
న్యూఢిల్లీ: తన అన్నయ్య రాహుల్ గాంధీ కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నానని, అలాగే తను కూడా నా కోసం ప్రాణాలు ఇస్తాడని కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్, ప్రియాంక మధ్య విభేదాలు ఉన్నాయని, వాటి కారణంగా కాంగ్రెస్ పతనమవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలను ప్రియాంక ఖండించారు. మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు లేవని అన్నారు. ‘‘యోగీజీ మనసులో ఏదో ఆందోళన ఉంది. బీజేపీకి, తనకు, ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు యోగి కామెంట్లు ద్వారా అనిపిస్తోంది’’ అని ప్రియాంక అన్నారు. యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న ప్రియాంక.. అధికారంలో ఉన్న బీజేపీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ కూటమికి వ్యతిరేకంగా పార్టీ ప్రచారాన్ని ముందుకు
తీసుకెళుతున్నారు.