Good Health : రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుందా..!

Good Health : రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుందా..!




ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. డయాబెటిస్ కంట్రోల్ లో ఉండకపోతే అది గుండెపై ప్రభావం చూపి హార్ట్ అటాక్ దారి తీసే ప్రమాదం ఉందని షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ  నిత్యం ఆందోళన చెందుతున్నారు.  ఇటువంటి టైంలో కొన్ని అధ్యయనాలు షుగర్ పేషెంట్లకు ఓ శుభవార్త చెబుతున్నాయి. మీరు డైలీ తినే ఆహార పదార్థాలతోనే మీ షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని ఇటీవల పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేసే శుభ వార్త ఏంటో తెలుసుకుందాం..  

వెల్లుల్లి రెబ్బలు..రోజు మనం కూరల్లో వేసుకునే ఇంగ్రీడియెంట్. దీనిని మన ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తుంటారు. వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని మన పెద్దలు చెబుతుంటారు.. ఇది నిజమే అంటున్నాయి కొన్ని పరిశోధనలు.

వెల్లుల్లిని రోజు పరిగడపున రెండు రెబ్బలు తింటే డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని ఈ పరిశోధనల సారాంశం. నిద్ర నుంచి లేవగానే మొహం కడుక్కొని రెండు వెల్లుల్లి రెబ్బలి నమిలి.. ఆ తర్వాత వేడినీటితో శుభ్రం చేసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందని చెబుతున్నాయి. అంతేకాదు.. చెడు కొలస్ట్రరాల్ ను కూడా తగ్గిస్తాయట. 

పరిశోధనల ప్రకారం.. వెల్లుల్లిలో ఉంటే యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు డయాబెటిస్, హార్ట్ బ్లాకేజ్ లను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. మొత్తం 29 అధ్యయనాల సమీక్ష అనంతరం రోజు రెండు వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిరూపితమైంది. 

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. 

తాజా పరిశోధనలు మొత్తం 29 అధ్యయనాల ను వివరిస్తుంది. మొత్తం 1500 మందిపై ఈ పరిశోధనలు జరిపారు. మూడు నెలల పాటు రక్త పరీక్షలు నిర్వహంచగా.. HbA1C లెవెల్స్ ను వెల్లుల్లి రెబ్బలు తగ్గిస్తాయని తేలింది. అంతేకాదు లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL) (దీనినే చెడు కొలస్ట్రరాల్ అంటారు) తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 

డయాబెటిస్ పై వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది? 

మొత్తం 9 అధ్యయనాల ఫలితాలు డయాబెటిస్ పై వెల్లుల్లి ఎటువంటి ప్రభావం చూపుతుందో విశ్లేషించాయి. ప్రతి రోజు 1.5 గ్రాములు లేదా రెండు వెల్లుల్లి రెబ్బల చొప్పున రెండు వారాలపాటు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గాయని తేలింది. 12 వారాల తర్వాత రక్తంలోని గ్లూకోజ్ గణనీయంగా తగ్గిపోయింది. వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్.. ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుందట. కణాలు గ్లూకోజ్ ను సంగ్రహించడంలో ఎలిసిన్  సాయం చేయడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీనీ మెరుగు పరుస్తుంది. 

కొలెస్ట్రరాల్ ను ఎలా తగ్గిస్తుందంటే.. 

వెల్లుల్లి ఆరోగ్యకర లక్షణాల వెనక సైన్స్ ప్రభావం ఉంది. ఇది కొలెస్ట్రరాల్ ను మెరుగుపరుస్తుంది. ఆర్గనోసల్ఫర్ కాంపోనెండ్స్ లో బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయి ఉంటుంది. కొలెస్ట్రరాల్ సంశ్లేషణ, కొలస్ట్రాల్ తక్కువ ప్లాస్మా లెవెల్స్ లను నిరోధిస్తుందని జంతువులు, మానవులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందట వెల్లుల్లి రక్తం గడ్డకట్టడాన్ని వేగవంతం చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.దీంతో గుండెను పదిలంగా కాపాడుతుంది. హైడెన్సిటీ లెవెల్ లిపోప్రొటీన్ ను క్రమబద్దీకరిస్తుంది. 

మీ ఆహారంతో వెల్లుల్లిని ఎలా తినాలంటే.. 

పచ్చి వెల్లుల్లిని తినొచ్చు. మనం రోజు కూరలో వేసుకునే మసాలలతో కలిపి వాడొచ్చు. వెల్లులి రసం సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి. వీటితోపాటు గార్లిక్ ఇన్ ఫ్ల్యూజ్డ్  ఆయిల్స్, గార్లిక్ సాస్ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.