
నితిన్ హీరోగా నటించిన రాబిన్‍హుడ్ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ శుక్రవారం (మార్చి 28న) రాబిన్‍హుడ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబిన్‍హుడ్ సినిమాకు టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.
సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్‍పై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్‍కు రూ.75 ధరను అదనంగా పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా రిలీజయ్యే మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు అధిక ధరలకు ఒకే చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలుచోట్ల అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.
Robinhood got a ticket hike done for their movie!
— Madhuri Daksha (News Presenter) (@MadhuriDaksha) March 25, 2025
AP Singles ₹197.5 and Plexes ₹252!
TG ₹175 & ₹295!!#RobinhoodOnMarch28th #Robinhood #TeluguNews #News #Telugu #TFI #MovieNews #nithiin #Sreeleela #DavidWarner #AP #TG pic.twitter.com/8Q3Ej4tS38
అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం ప్రదేశాలలో మాత్రమే, ఈ పెంపుదల వర్తిస్తుందని మేకర్స్ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు మరియు మొత్తం తెలంగాణాలోని అన్ని థియేటర్స్ లో సాధారణ ధరలు ఉంటాయని నాట్ లో తెలిపారు.
Explosive entertainment at affordable prices.#Robinhood pic.twitter.com/v8W5PZKXGa
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025
తెలంగాణ: ₹175 (సింగిల్ స్క్రీన్లు) & ₹295 (మల్టీప్లెక్స్‌లు)
ఆంధ్రప్రదేశ్: ₹197.5 (సింగిల్ స్క్రీన్లు) & ₹252 (మల్టీప్లెక్స్‌లు)
టికెట్ల పెంపు సరైనదేనా?
సుమారు రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన రాబిన్‍హుడ్ మూవీకి టికెట్ల పెంపు సరైనదేనా? అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే, రాబిన్‍హుడ్ మూవీకి బడ్జెట్ పరంగా చూస్తే చెప్పుకోదగ్గ పెద్ద భారీ బడ్జెట్ మూవీ కాదు. దీంతో టికెట్ల పెంపు ఈ చిత్రానికి కరెక్టేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. మొన్నటి 2025 సంక్రాంతి రిలీజ్ సినిమాల వరకు, కేవలం భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి.
ALSO READ | ఐ లవ్ డేవిడ్ వార్నర్.. అనాల్సిన మాటలన్నీ అని సారీ చెప్పిన రాజేంద్ర ప్రసాద్.
అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ మూవీస్ కూడా ఇలా టికెట్ రేట్ల పెంపునకు వెళితే, ప్రేక్షకులపై భారం పడుతుంది. ఇలాంటి సినిమాలకు కూడా అధిక రేట్లు పెంచడం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. సినిమా ఫస్ట్ షోకి పాజిటివ్ టాక్ వస్తే, ఆ లెక్క వేరే ఉంటుంది. కానీ, మిక్స్డ్ టాక్ అందుకుంటే మాత్రం ఇక అంతే సంగతని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఎందుకంటే, గతంలో అధిక టికెట్ ధరల కారణం చేత థియేటర్స్కు ఆడియన్స్ వెళ్లడం మానేశారు. అదనపు ధరలే మైనస్ అవ్వకుండా చూసుకోవాలంటే, సినిమాకు పాజిటివ్ టాక్ ఒక్కటే నిలబెడుతుంది. ఇదిలా ఉండగా.. మ్యాడ్ 2 మూవీ సైతం టికెట్ల పెంపు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబిన్‍హుడ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఇందులో నితిన్ సరికొత్త పాత్రలో ట్రెండీ లుక్‌లో కనిపించనున్నాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.