
డీ విటమిన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. బాడీలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ), ఎముకలు బలంగా ఉండాలంటే ఈ సన్ షైన్ విటన్ సరిపడా మన బాడీలో ఉండాల్సిందే. ఈ విటమిన్ శరీరంలో సమపాళ్లలో ఉంటే హార్మోన్స్ బ్యాలన్స్డ్ గా ఉంటాయి. అయితే వీటితో పాటు మానవ ప్రత్యుత్పత్తికి సంబంధించి హార్మోన్స్ బాగా పనిచేయాలంటే డీ విటమిన్ తప్పనిసరిగా ఉండాలని ఒక సర్వేలో తేలింది. ప్రత్యుత్పత్తికి, ప్రెగ్నెన్సీకి డీ విటమిన్ ఎలా ఉపయోగపడుతుందనే డౌట్ వస్తుంది కదా.. ఐతే చదవండి.
బాడీలో డీ విటమిన్ రిలీజ్ కావాలంటే ఎండ తగలాలని చెప్తుంటారు. ఎందుకంటే బాడీలో అది ఉత్పత్తి కావాలంటే సూర్యకిరణాల వలన జరుగుతుంది. అయితే ప్రెగ్నెన్సీకి కూడా డీ విటమిన్ చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. అయితే అది కూడా బాడీకి ఎంత మోతాదులో కావాలో అంతే ఎండ స్వీకరిస్తేనే డీ విటమిన్ బ్యాలన్స్ ఉంటుంది.
ALSO READ | వరల్డ్ వాటర్ డే.. ప్రపంచాన్ని సేవ్ చేసేందుకు మన వంతుగా ఏం చేద్దాం..?
డీ విటమిన్ రిప్రొడక్టివ్ (ప్రత్యుత్పత్తి) హార్మోన్స్ ను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శుక్రకణాల (స్పెర్మ్) కదలికకు, ఎగ్(అండం) క్వాలిటీ ఉండటంలో తోడ్పడుతుంది. డీ విటమిన్ లోపం వలన పురుషుల్లో శుక్రకణాలు బలహీనంగా ఉంటాయి. అదే సమయంలో స్త్రీలలో అండం ఉత్పత్తి ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఇది కూడా ఫెర్టిలిటీకి ప్రభావితం చేస్తుంది.
ఎక్కువ నీడలో ఉండే వారు డీ విటమిన్ సప్లిమెంట్స్ వినియోగింవచ్చు. అయితే న్యాచురల్ గా ఎండ నుంచి లభించడం మంచిదని చెబుతున్నారు. అయితే కావాల్సిన దానికంటే ఎక్కవ ఎండ తగిలినా శ్రేయస్కరం కాదని అంటున్నారు. మరీ ఎక్కువ ఎండకు ఉంటే కొందరిలో స్కిన్ ఎలర్జీ, కొందరిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సూర్యకిరణాలలో ఉండే అల్ట్రా వాయిలెట్ (UV) కిరణాల రేడియేషన్ కారణం అని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన డా.వెంటక సుజాత వెల్లంకి తెలిపారు.
విటమిన్ డీ పొందడం ఎలా..?
బాడీపైన ఎండ తగలగానే అల్ట్రావాయిలెట్ బీ (UVB) కిరణాల వలన బాడీలో విటమిన్ డీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే డీ విటమిన్ పొందాలంటే మధ్యాహ్నం సమయం సరైనదని చెబుతున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ నూన్ సూర్యకిరణాలు డైరెక్ట్ గా బాడీపై పడుతుంటాయి. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డీ విటమిన్ పొందేందుకు ఐడియల్ టైమ్ అని చెబుతున్నారు. 10 నుంచి 30 నిమిషాల ఎండలో ఉంటే సరిపోతుందని చెబుతున్నారు వైద్యులు. అయితే డార్క్ స్కిన్ ఉన్న వాళ్లకు కాస్త ఎక్కువ టైమ్ పడుతుందట.