ఈ యాప్స్ వాడుతున్నారా?

ఈ యాప్స్ వాడుతున్నారా?

మీకు పేటీఎం తెలుసు కదా..? బిల్లు లు చెల్లించేందుకు పేటీఎం వాడే ఉంటారు. అలాంటిదే టీ-వ్యాలెట్ కూడా. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పేమెంట్స్ మాత్రమే కాదు. ప్రైవేట్ సేవల్ని కూడా వినియోగించుకోవచ్చు. వ్యాలెట్‌‌‌‌లో డబ్బులు టాప్-అప్ చేసుకోవడం, ఇతరుల బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ చేయడం లాంటి అనేక సేవలున్నాయి. ఈ యాప్ లో. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి  ఇది దేశంలోనే మొట్టమొదటి ఈ–వ్యాలెట్ కావడం విశేషం. టీ-వ్యాలెట్ ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ చెల్లిం పులకు అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్ తెలుగుతో పాటు ఉర్దూ భాషల్లోనూ ఇది సేవలు అందిస్తుంది. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఈ వ్యాలెట్ ద్వారా అన్ని రకాల చెల్లిం పులు చేయవచ్చు.స్కాలర్ షిప్ లు, పింఛన్లతో పాటు రేషన్ దుకా ణాలకు కూడా టీ-వ్యాలెట్ ను అనుసంధానం అయ్యి ఉన్నాయి. అంతే కాకుం డా.. ఫోన్ లేకున్నా మీ సేవా సెంటర్ల ద్వారా టీ వ్యాలెట్ తో లావాదేవీలు జరిపే అవకాశం ఉండటం దీని మరో ప్రత్యేకత.

టీయస్‌ టీడీసీ

మన రాష్ట్రం లో పర్యాటకానికి ఆదరణ పెరుగుతుండటంతో పర్యాటకుల కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ టీఎస్‌ టీడీసీ యాప్‌‌‌‌ను రూపొందించిం ది. ఇందులో తెలంగాణలోని పర్యాటక ప్రాంతా ల సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇందులో కొత్త ప్రాంతాలకుఎలా వెళ్లాలి , ఏ మార్గంలో ప్రయాణించాలి,ఎక్కడ బస చేయాలి, చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలేంటి? ప్రత్యేక ప్యాకేజీలేమైనా ఉన్నాయా ఇలాంటి వివరాలెన్నో లభిస్తాయి. ఈ యాప్ ద్వారా ముందుగా టికెట్లు హోటల్‌ గదులనూ బుక్‌‌‌‌ చేసుకోవచ్చు. విద్యు త్ సేవల కోసం ఈ టీఎస్ఎస్‌ పీడీసీఎల్ యాప్. ఎలక్ట్రిసిటీ బిల్స్, వర్ లేకపోతే ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, గతంలో చెల్లిం చిన బిల్ వివరాలు, టారిఫ్ వివరాలు, విద్యుత్ ఆదా చేయడానికి సలహాలు ఇలా అనేక సేవలున్నాయి ఈ యాప్ లో. విద్యుత్‌‌‌‌ బిల్లు తనిఖీ చేసుకోవడంతో పాటు కొత్త సర్వీసుల రిజిస్ర్టేషన్ లు, పేబిల్స్‌‌‌‌ వంటి అంశాలు ఈ యాప్‌‌‌‌లో ఉన్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌‌‌‌లో  టీఎస్ఎస్పీడీసీఎల్‌ అనిటైప్‌‌‌‌చే సి యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీఎస్ఎస్‌ పీడీసీఎల్
విద్యు త్ సేవల కోసం ఈ టీఎస్ఎస్‌ పీడీసీఎల్ యాప్. ఎలక్ట్రిసిటీ బిల్స్, పవర్ లేకపోతే ఫిర్యాదులు, సేవలకు  బంధించిన ఫిర్యాదులు, గతంలో చెల్లిం చిన బిల్ వివరాలు, టారిఫ్ వివరాలు, విద్యుత్ ఆదా చేయడానికి సలహాలు ఇలా అనేక సేవలున్నాయి ఈ యాప్ లో. విద్యుత్‌‌‌‌ బిల్లు తనిఖీ చేసుకోవడంతో పాటు కొత్త సర్వీసుల రిజిస్ర్టేషన్ లు, పేబిల్స్‌‌‌‌ వంటి అంశాలు ఈ యాప్‌‌‌‌లో ఉన్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌‌‌‌లో టీఎస్ఎస్పీడీసీఎల్‌ అని టైప్‌‌‌‌చే సి యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌ చేసుకోవచ్చు.

మై జీహెచ్ఎంసీ
ఈ యాప్‌‌‌‌ జీహెచ్ఎంసీ పరిధిలో నివసించే వారికి ఎంతో ఉపయోగకరం. ఆస్తిపన్ను,వ్యాపార లైసెన్సు , గ్రీవెన్స్‌‌‌‌ , ట్రేడ్ సెన్స్ఫీజు, ఎల్‌ ఆర్ఎస్ దరఖాస్తు స్టేటస్, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు డౌన్‌‌‌‌లోడ్‌ చేసుకోవడం వంటి వాటికి వాడుకోవచ్చు.అంతేకాదు… ఎక్కడైనా తెరిచి ఉన్న మ్యాన్‌‌‌‌హోల్స్ కనిపించినా, రోడ్లు రిపేర్ చేయాల్సి ఉన్నా, వీధిలైట్లు పనిచేయకపోయినా కంప్లైంట్ చేయొచ్చు. ఓటర్ స్లిప్‌‌‌‌లు అందని వారు ‘మై జీహెచ్‌‌‌‌ఎంసీ’ యాప్ నుం చి కూడా ఓటర్ స్లిప్ డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం ఆ యాప్‌‌‌‌లోకి వెళ్లి పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితా ఫారం వస్తుంది. అందులో మీ ఫొటో, ఇతరవివరాలతో ఉన్న ఫారాన్ని ప్రింట్ తీయిం చు-
కుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఆర్టీఏ  ఎంవ్యాలెట్
వాహానానికి సంభందించిన అన్నిపత్రాలు కాగితా ల రూపంలో భద్రపరుచుకోవడం సాధ్యం కాదు. అందుకే అలాంటి పత్రాలను యాప్లో భద్రపర్చుకునే విధంగా ఈ -వ్యాలెట్ ను రూపొందిం చారు. ఎంవ్యాలెట్ యాప్ ద్వారా  రవాణాశాఖకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు మీ జేబులో ఉన్నట్లే.ఆర్సీ, డ్రైవిం గ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌‌‌‌నెస్, పర్మిట్, కాలుష్యం వంటి తదితర సర్టిఫికెట్లను యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఇందులో ప్రవేశపెట్టిన అన్ని రకాల వాహన సేవలను పోలీస్‌ శాఖకు కూడా అనుసంధానం చేసా రు. ఈ విధంగా ఆర్టీఏ లో కూడా కాగిత రహిత టెక్నాలజీని ఉపయోగిస్తు న్నారు.

టీఎస్‌ ఆర్‌ టీసీ
టీఎస్‌ ఆర్‌‌‌‌టీసీ యాప్ ద్వారా ఆర్టీసీ బస్‌ టికెట్లు బుక్ చేసుకోవడం, సీట్ల స్టేటస్ తెలుసుకోవడం లాంటి సేవల్ని పొందొచ్చు. హైదరాబాద్ నుం చి ఇతర జిల్లాలకు వెళ్లేవాళ్లు..ఈ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌ చేసుకుని టిక్కెట్లను ఆన్‌‌‌‌లైన్లోనే తీసుకోవచ్చు. ఎంజీబీఎస్‌ , జేబీఎస్‌ కు అత్యం త కష్టం మీద వెళ్లి బస్సును పట్టుకోవాల్సి న పని లేకుం డా.. మీరు ఎక్కాల్సి న బస్సు ఎంత సమయంలో మీ దగ్గరకు వస్తుందో తెలుసుకునే అవకాశాన్ని టీఎస్‌ ఆర్టీసీ కల్పించిం ది. దీనిని నగర ప్రయాణికులు బాగానే వినియోగించుకుంటు న్నారు. ఈ యాప్ ద్వారా బస్సులను అద్దెకు కూడా బుక్ చేసుకోవచ్చు.

టీ-సవారీ
ఇది హైదరాబాద్ మెట్రో రైల్‌ సేవల కోసం తీసుకొచ్చిన యాప్. రైళ్ల రాకపోకలు, దూరం,సమయం, ఇంటర్‌‌‌‌చేంజ్ రూట్స్ లాంటివివరాలన్నీ ఉంటాయి. ఈ యాప్ ద్వారానేక్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. నగరంలోప్రయాణానికి సంబంధించి అందుబాటు లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను కూడా ఇందులో భాగస్వాములను చేసిం ది ఈయాప్. ట్రావెల్స్‌‌‌‌ విభాగంలో ప్లాన్‌‌‌‌ యువర్‌‌‌‌ ట్రిప్‌‌‌‌.. ట్రైన్‌‌‌‌ టైమింగ్స్‌‌‌‌, మెట్రో నెట్‌‌‌‌ వర్క్‌‌‌‌ నెట్‌‌‌‌ వర్క్‌‌‌‌ మ్యాప్‌‌‌‌, మెట్రో స్టేష న్స్‌‌‌‌, మెట్రో రైళ్ల మాచారం ఉంటుంది. ఫేర్‌‌‌‌ అండ్‌ టికెటింగ్‌‌‌‌ విభాగంలో టికెటింగ్‌‌‌‌ సమాచారంతో పాటు చార్జీలు,ఫైండ్‌ ట్రిప్‌‌‌‌ వివరాలు తెలుసుకోవచ్చు.

టీ-శాట్
ప్రభుత్వానికి సంబంధించిన ప్రమోషనల్  వీడియోస్ ఈ యాప్‌‌‌‌లో చూడొచ్చు.అంతేకాదు… పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఇందులో క్లాసులు కూడా వినొచ్చు. ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణలు ఇందులో ఉంటాయి. కాంపి టీటివ్ సబ్జెక్టుల్లో అవగాహన కోసం టీశాట్‌‌‌‌లో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్,జనరల్‌ సైన్స్‌‌‌‌తోపాటు పలు రకాల సబ్జెక్టుల్లో అనుభవజ్ఞు లతో తయారు చేయించిన మెటీరియల్, వీడియోస్ ఉంటాయి.

హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్

జంట నగరాల పరిధిలో ట్రాఫిక్ సమాచార సేవల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. లోకల్ ట్రాఫిక్ పోలీసు స్టేష న్ల సమాచారం, చిరునామా,అధికారుల కాం టాక్టు నంబర్లు, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు, రోడ్డుపై ప్రయాణించే సమయంలో పాటిం చాల్సిన టిప్స్, ఎమర్జన్సీ కాం టాక్ట్ సమాచారం, ట్రాఫిక్ ఉల్లం ఘనలపై జరిమానా, ఆటో చార్జీలు, లైవ్ ట్రాఫిక్  మాచారం ఈ-చలాన్ స్టాటస్, ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని తీసుకెళ్లినప్పుడు వాటి వివరాలు, మీ వాహనానికి సంబంధించి ఆర్టీఏలో ఉన్న వివరాలు, ఫిర్యాదుల సమాచారం,ఇలా ఎన్నో వివరాలు ఈ యాప్ లో లభిస్తాయి.

టీ రేషన్
తెలంగాణ పౌర సరఫరాల శాఖ టీ రేషన్ పేరుతో ఒక యాప్ ను తీసుకొచ్చిం ది. దీని ద్వారా రేషన్ కార్డుదారులు తమ కార్డుపై ప్రభుత్వం ఎంత మేర కోటా విడుదల చేసిం ది? ఏ రేషన్ షాపుకు విడుదలచేసిం ది? రేషన్ షాపునకు విడుదల చేసిన కమోడిటీలు, ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్, రేషన్ కార్డుపై జరిగిన లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. రేషన్ షాపు నంబర్, డీలర్ పేరు, మొబైల్ నంబర్, రేషన్ షాపు తెరిచి ఉందా, లేక మూసేసి ఉందా? తదితర సమాచారం కూడా తెలుసుకోవచ్చు