టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శుక్రవారం(జూన్ 07) కెనడా, ఐర్లాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్వల్ప స్కోర్లు నమోదవుతుండడం.. పిచ్ బ్యాటింగ్కు సహకరించకపోవడం.. సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి అదనపు ప్రయోజనం చేకూరుతుండడంతో ఐరిష్ కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
తుది జట్లు
కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్ కీపర్), దిల్ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్
ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్.