
ఇంట్లో మొక్కలుంటే ఆ వాతారణమే డిఫరెంట్గా ఉంటుంది. ప్రకృతి మైమరించే అందానికి అందం.. ఆహ్లాదం అబ్బో ఒకటేమిటి..చెప్పలేని అనుభూతిని పొందుతాం. అయితే ఈ మొక్కలను.. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నాటకూడు. కొన్ని మొక్కలు వాస్తు ప్రకారం అసలు ఇంట్లో ఉండకూడదు. బొప్పాయి చెట్టును ఇంటిని ముందు నాటొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం ...
హైటెక్ యుగంలో కూడా ఇల్లుకట్టాలంటే వాస్తు.. పెళ్లి చేసుకోవాలంటే జాతకం.. మంచి పని చేసేందుకు ముహూర్తం కోసం పండితులను సంప్రదిస్తుంటారు. అయితే కొన్ని మొక్కలు ఇంటి ముందు ఉండే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని చెబుతుంటారు పెద్దలు. కొంతమంది అయితే ఈ చెట్టు ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం అశుభంగా భావిస్తుంటారు.
ALSO READ | పొద్దున్నే నిద్ర లేవడం మంచిదా ? కాదా ? యాక్టివ్గా లేమని అనిపిస్తున్నా సరే నిద్ర లేవడం వల్ల..
బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని పండితులు చెబుతున్నారుఒకవేళ విత్తనం పడి చెట్టు మీ ఇంటి ముందు పెరిగితే మాత్రం ఆ మొక్కను పీకి వేరే చోట నాటాలి. ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు కరువు అవుతాయట. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటే ప్రయత్నం చేయకండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా కూడా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటారు. అంతేకాదు ఇంట్లో బొప్పాయి మొక్కను నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు వస్తాయని నమ్ముతారు.ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు కరువు అవుతాయట. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మానేయండి.