తరతరాల నుంచి పాలమూరు విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకోవడంలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్‌కు విద్యారంగంలో నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైంది. వైన్స్ టెండర్లు, బార్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ఉన్న చిత్తశుద్ధి విద్యారంగానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయలేని పరిస్థితి మీ ప్రభుత్వానిది!
ఓ వైపు ప్రభుత్వ సాంఘిక వసతి గృహాల పరిస్థితి చూసుకుంటే వంట గది టెండర్లు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తూ హాస్టళ్ల సంక్షేమం గాలికి వదిలేస్తున్నారు. విద్యా రంగంలో ఎలాంటి అభివృద్ధి చెందని ఉమ్మడి మహబూబ్ నగర్ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించే గ్రూప్ పరీక్షలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ పోటీపరీక్షలలో అత్యధికంగా కట్ ఆఫ్ మార్కులు నిర్దేశిస్తే మరి పాలమూరు విద్యార్థులు ఏ విధంగా ఉద్యోగాలు పొందుతారు? పాలమూరు విద్యార్థులకు ఏ విధంగా సర్కార్ నౌకరి లభిస్తుంది? రానున్న ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని యువత ఎందుకు ఎన్నుకోవాలో చెప్పగలరా సీఎం గారూ ?
ALSO READ : తలసరి ఆదాయం అభివృద్ధికి గీటురాయా?