Credit Card Limit: లిమిట్ను మించి మీ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు..ఎలా అంటే..

Credit Card Limit: లిమిట్ను మించి మీ క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు..ఎలా అంటే..

సాధారణంగా క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు..ఇచ్చిన లిమిట్లో షాపింగ్ చేయొచ్చు.. పెట్రోల్ కొట్టించుకోవచ్చు.. మొబైల్ కొనుక్కోవచ్చు.. ఇలా అనేక రకాలుగా క్రెడిట్ కార్డును వినియోగించుకోవచ్చు. ఇదంతా ఇచ్చిన క్రెడిట్ లిమిట్ లోనే చేయాలి. అయితే ఇక్కడ మరో గ్రేట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే.. మనకు క్రెడిట్ కార్డులపై ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువగా కూడా వినియోగించుకోవచ్చు.. అదే ఓవర్ డ్రాప్ట్ లిమిట్ ఆప్షన్.. ఇది ఎలా పనిచేస్తుందో  తెలుసుకుందాం.. 

ప్రతి క్రెడిట్ కార్డును వినియోగించేందుకు ఓ క్రెడిట్ లిమిట్ ను కలిగి ఉంటుంది. ఉదాహరణకు రూ. 10 లక్షల లిమిట్ ఉందనుకోండి. పది లక్షల వరకు మనం ఖర్చు చేయొచ్చు. కానీ మనకు అంతకంటే ఎక్కువగా అవసరం పడితే.. అంటే 12 లక్షలు అవసరం ఉంటే కూడా ఖర్చు చేయొచ్చు.  అంటే మనకు ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువగా కూడా వాడుకోవచ్చు. 

ALSO READ | ఎల్‌‎ఎమ్‌‎ఎఫ్‌‎‌‌పీ బ్యాటరీతో గ్రావ్టన్​ క్వాంటా ఈ–స్కూటర్

క్రెడిట్ కార్డుపై ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువగా వినియోగించాలంటే ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఆప్షన్ ఏనేబుల్ ద్వారా ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువగా వినియోగిం చుకునే ఛాన్స్ ఉంది. 

క్రెడిట్ కార్డుపై ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువగా వినియోగించుకోవాలంటే.. కొన్ని నియమాలున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)  షరతులు విధించింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కార్డ్-జారీదారు ప్లాట్‌ఫారమ్‌లలో transaction control mechanism  ద్వారా ఓవర్‌ డ్రాఫ్ లిమిట్  ఆప్షన్ ను ఎనేబుల్, డిసేబుల్ చేసుకునేందుకు కార్డ్ హోల్డర్‌కు అనుమతినిచ్చింది.  రిజర్వ్ బ్యాంక్ మార్చి 7, 2024 రూల్స్ ప్రకారం.. ఓవర్‌లిమిట్ సౌకర్యం కోసం కార్డ్ హోల్డర్ నుండి స్పష్టమైన సమ్మతి పొందకపోతే, ఓవర్‌లిమిట్ అందించబడదు లేదా ఓవర్‌లిమిట్ ఛార్జీలు విధించబడతాయి.