చరిత్ర సృష్టించిన కెనడా.. టీ20 వరల్డ్ కప్‌కి తొలిసారి అర్హత

చరిత్ర సృష్టించిన కెనడా.. టీ20 వరల్డ్ కప్‌కి తొలిసారి అర్హత

2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ వరల్డ్ కప్ కు ఇప్పటివరకు 15 జట్లు అర్హత సాధించాయి. తాజాగా ఈ లిస్టులోకి కెనడా దేశం  చేరిపోయింది.  టీ 20 వరల్డ్ కప్ కి కెనడా క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. 2011లో ఆ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యింది.

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్ లో భాగంగా బెర్ముడాపై నిన్న జరిగిన మ్యాచులో కెనడా 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన కెనడా 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా..లక్ష్య ఛేదనలో బెర్ముడా 16.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. కెనడా బౌలర్‌ కలీమ్‌ సనా 3.5 ఓవరల్లో కేవలం నాలుగు పరులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. కలీమ్ అద్భుత అద్భుత స్పెల్ బెర్ముడా దగ్గర సమాధానం లేకుండా పోయింది. కెనడా బ్యాటర్లలో నవనీత్‌ ధలీవల్‌ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  

ALSO READ : Cricket World Cup 2023: సచిన్‌,డివిలియర్స్‪ని వెనక్కి నెట్టిన వార్నర్.. వరల్డ్ కప్‪లో ఆల్ టైం రికార్డ్

 ఇక టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది.  ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌,ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫై మ్యాచులు ఆడి ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ వరల్డ్ కప్ ఆడే జట్ల జాబితాలోకి చేరిపోయాయి. వచ్చే ఏడాది జూన్ 4నుంచి 31 వరకు ఏ మెగా ఈవెంట్ జరగనుంది. వెస్టిండీస్‌, యూఎస్‌ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.