కెనడాలో హిందూ దేవాలయంపై నవంబర్ 4న ఖలీస్తానీ మద్దతు దారులు దాడి చేసిన సంగతి తెలిసిందే.. బ్రాంపప్టన్ లోని హిందూ టెంపుల్ బయట ఖలీస్తాన్ నిరసనలో పాల్గొన్న ఓ కెనడా పోలీసు అధికారిని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హరీందర్ సోహి అనే పోలీసు అధికారి ఖలిస్తాన్ జెండాను పట్టుకుని నిరసన తెలుపుతున్నట్లు వీడియోలో వైరల్ అయ్యింది. ఆఫ్ డ్యూటీ పీల్ పోలీసు అధికారి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్లు మాకు తెలుసు. ఈ అధికారి కమ్యూనిటీ సేఫ్టీ అండ్ పోలీసింగ్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేయబడ్డారని పీల్ పోలీస్ అధికార ప్రతినిధి రిచర్డ్ చిన్ తెలిపారు.
Also Read :- ఇరాన్ లో అర్థనగ్నంగా నిరసన తెలిపిన యువతి ఇప్పుడు కనబడట్లేదు
ఒంటారియోలోని బ్రాంప్టన్లో నవంబర్ 3న ఉదయం హిందూ సభా మందిర్లోకి కర్రలు, ఖలిస్తాన్ జెండాలతో దూసుకెళ్లారు. భక్తులను చితకబాదారు. హిందూ సభ మందిరం, ఇండియన్ హై కమిషన్ ఆధ్వర్యంలో ఆలయంలో క్యాంపు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న ఖలిస్తాన్ సపోర్టర్లు.. గుడి వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద కమిషన్ అధికారులు ఉండకూడదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. మందిరంపై దాడి చేశారని తెలుసుకున్న భక్తులు.. దుండగుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపైనా ఖలిస్తానీ మద్దతుదారులు గొడవకు దిగారు.