కెనడాలో ముగ్గురు భారతీయులు అరెస్ట్

గతేడాది బ్రిటిష్ కొలంబియాలో హత్య కు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ కేసులో ముగ్గురిని కెనడా పోలీసులు శుక్రవారం(మే 3)  అరెస్ట్ చేశారు. కరణ్ ప్రీత్ సింగ్ , కమల్ ప్రీత్ సింగ్, కరన్ బ్రార్ అనే ముగ్గురు భారతీయులను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితంకెనడాలో అనుమానితులను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిపై గట్టి నిఘా పెట్టి పట్టుకున్నారు. 

2023 జూన్ 18న సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారాలో సాయంంత్రం ప్రార్థనలు ముగించుకొని వస్తుండగా హర్దీప్ సింగ్ నిజ్జార్ ను నిందితులు కాల్చి చంపారు. 

నిజ్జార్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం గురించి మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. వేర్పాటు వాదం, తీవ్రవాదం, హింస ను ప్రోత్సహించేలా కెనడా ప్రధాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని విమర్శించింది. 

కెనడా ప్రధాని ట్రూడో ఇంతకుముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. వేర్పాటు వాదం, తీవ్రవాదం, హింసకు కెనడా రాజకీయ అడ్డా ట్రూడో వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిది రణధీర్ జైస్వాల్ అన్నారు. 

నిజ్జార్ ఒక ఖలిస్తానీ వేర్పాటు వాది, అతను వివిధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు భారత్ లో మోస్ట్ వాంటెండ్ ఉన్నారు. ట్రూడో ఓ కార్యక్రమంలో చేసిన ఖలిస్తాన్ అనుకూల నినాదాలపై కెనడియన్ డిప్యూటీ హైకమిషనర్ ను కూడా వెనక్కి పిలిపించి భారత్ అధికారికంగా నిరసన కూడా తెలిపింది.