కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు.. ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాబోయే ప్రధాని

కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు.. ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాబోయే ప్రధాని

ఒట్టావా: అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో భాగం కాబోదని స్పష్టం చేశారు. తమ దేశం అప్పటికీ, ఇప్ప టికీ బలంగా ఉందన్నారు. వాణిజ్యమైనా, క్రీడలైనా చివరకు విజయం సాధించేది తమ దేశమేనని పేర్కొన్నారు. 

కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా ఆయన ఎన్నికయ్యారు. దీంతో ఆయన తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశం లో మాట్లాడిన మార్క్ కార్నీ... 'కెనడాను తమలో కలుపుకొని, ఈ విషయంలో వారు విజయం సాధిస్తే, మన జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. కాబట్టి ట్రంప్ ను ఎప్పటికీ ఈ విషయంలో విజయం సా ధించనివ్వను.' అన్నారు.


కెనడా లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఆదివారం (మార్చి 9) జరిగిన ఎన్నికలో మార్క్ కార్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 59 ఏళ్ల కార్నీ 86 శాతం ఓట్ల సాధించి లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కెనడాను యూఎస్ లో కలిపేసుకుంటాం అని ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు పీఎం గా బాధ్యతలు చేపట్టక ముందే కార్నీ  స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.