
అమెరికా బాటలో కెనడా సాగుతోంది. వలసదారుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల అమెరికా తమ దేశంలో ఉన్న వలసదారులను బహిష్క రించిన విషయం తెలిసిందే. కెనడా కూడా వలసదారులపై ఆంక్షలు విధిస్తోంది.. అందులోభాగంగా విదేశీ పౌరులకు జారీ చేసే స్టూడెంట్, వర్క్ వీసాలను రద్దు చేయవచ్చు.
కొత్త రూల్స్ ప్రతి యేటా లక్షలాది మంది విదేశీ పౌరులను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా భారతీయులపై ఎక్కవ ప్రభావం ఉండనుంది. కెనడాలో ఎక్కవమంది భారతీయులు ఇటువంటి వీసాలపై నే ఉన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, కెనడాలో దాదాపు 4లక్షల 27వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఎడ్యుకేషన్, టూరిజం, వర్క్ కోసం తీసుకున్న వీసాలను ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ నిబంధనల్లో భాగంగా సరిహద్దు అధికారుల అధికారాలను పెంచారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్, బార్డర్ అధికారుల ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ ను , టెంపరరీ రెసిడెంట్ వీసాల వంటి తాత్కాలిక వీసాలను రద్దు చేసేందుకు గతం కంటే ఎక్కువ అధికారాలను అధికారులకు ఇచ్చారు.