భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ ఉందని ఆరోపిస్తున్న కెనడా ప్రధాని  జస్టిన్ ట్రూడో  కీలక వ్యాఖ్యలు చేశారు.  భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడంలో తమ దేశం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు.  ప్రపంచవ్యాప్తంగా భారత్ కు ఉన్న పలుకుబడి దృష్ట్యా ఆ దేశంతో  సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నామని, ఇది తమ దేశానికి చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

  " భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు.. కీలక భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత ఉన్న దేశం. మేము గతేడాదే మా ఇండో-పసిఫిక్‌ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్‌తో సంబంధాలును బలోపేతం చేసుకోవడంపై మేము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం " అని తెలిపారు.  

ALSO READ : ప్రజలు ప్రతిపక్షాలను నమ్మట్లే: బొల్లం మల్లయ్య యాదవ్​

హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడుతూ..  కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు . కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్‌ హత్య విషయంలో మాతో కలిసి భారత్‌ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలని ట్రూడో  చెప్పారు. కెనడా పౌరుడిని మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారన్న ట్రూడో ..  నిజ్జర్‌ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్నారు.