ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నలుగురు భారతీయులకు గురువారం (9 జనవరి 2025) కెనడా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 11న ఉంది. ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నిందితులపై సరైన ఆధారాలను కెనడా పోలీసులు సమర్పించలేకపోయారని కెనడా మీడియా తెలిపింది.
కరణ్ బ్రార్, అమర్ దీప్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్ లపై హత్యా రోపణలతో 2024 నవంబర్ లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల పిటిషన్ ను అంగీకరించి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణలో భాగంగా ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవగా, ఒకరు కౌన్సిల్ ద్వారా హాజరయ్యారు.