అమెరికాలో కరెంట్ ఎలా ఉంటుందో చూస్తాం:కెనడా మాస్ వార్నింగ్

అమెరికాలో కరెంట్ ఎలా ఉంటుందో చూస్తాం:కెనడా మాస్ వార్నింగ్

ట్రంప్ తారీఫ్ యుద్దానికి కెనడాప్రతీకార చర్యలు పెంచింది. కెనడా, మెక్సికో, చైనాలపై 25 శాతం దిగుమతి సుంకం పెంచిన తర్వాత కెనడా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచింది.. తాజాగా అమెరికాకు అందిస్తున్న కరెంట్ ను కూడా కట్ చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ కెనడాపై దిగుమతి సుంకాలను కొంత టైం ఇచ్చినప్పటికీ కెనడా ఈ నిర్ణయం తీసుకుంది. మీరు సుంకాలు పెంచితే.. మేం మీకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించింది కెనడా. 

కెనడాకు చెందిన శాసనసభ్యుడు అమెరికాకు హెచ్చరికలు జారీ చేశాడు.‘‘ఇటీవల కెనడియన్ దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 25శాతం సుంకాలకు ప్రతి స్పందనగా విద్యుత్తు  ఛార్జీలను పెంచుతాం లేదా విద్యుత్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని’’ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ వార్నింగ్ ఇచ్చాడు. 

‘‘అమెరికాకు అతిపెద్ద కరెంట్ సప్లయర్ ఒంటారియో.. ఇప్పటికే జీవన వ్యయం అత్యంత గరిష్ట్ స్థాయిలో ఉన్న అమెరికన్ల జీవితాలను మరింత ఖరీదైనవిగా మాకు ఇష్టం లేకపోయినప్పటికీ.. విద్యుత్తు ఛార్జీలు పెంచడం తప్ప మాకు మరో మార్గం లేదు’’ అని డగ్ ఫోర్డ్ అన్నారు. 

ALSO READ | ఎలాన్ మస్క్ ఇండియాలో ఏమీ సాధించలేడు..సజ్జన్ జిందాల్ సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ

2023లో అంటారియోనుంచి 1.5 మిలియన్ల US గృహాలకు విద్యుత్ సరఫరా చేయబడింది. న్యూయార్క్, మిచిగాన్ , మిన్నెసోటా వంటి రాష్ట్రాలకు కీలక ఎగుమతిదారుగా ఒంటారియో ఉంది. అయితే ఫోర్డ్ ప్రకటనతో కరెంట్ తోపాటు ఇతర దిగుమతులపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కెనడా బెదిరింపుపై న్యూయార్క్ గవర్నర్..

ఫోర్డ్ మాస్ వార్నింగ్ పై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ స్పందించారు. ఈ  సంక్షోభ సమయంలో కెనడా, అమెరికా చర్చలు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కెనడా, మెక్సికోలపై ట్రంప్ దిగుమతి సుంకాల నిర్ణయాన్ని విమర్శించారు. ట్రంప్ నిర్ణయం న్యూయార్క్ రైతులకు హానికరం.. సుంకాలు పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలువంటి వ్యవసాయ ఉత్పత్తులపై వినియోగదారుల ఖర్చులు పెద్ద ఎత్తున పెరగవచ్చని గవర్నర్ కాథీ హోచుల్ హెచ్చరించారు. 

కెనడా బెదిరింపులపై మిచిగాన్ రియాక్షన్.. 

కెనడా బెదిరింపులకు మేం భయపడం..వాస్తవానికి మిచిగాన్  కు చాలా విద్యుత్తు కెనడా నుంచే వస్తుంది.. అయినా  మిచిగాండర్ల ఉపయోగించే ఎక్కువ విద్యు్త్తు మిచిగాన్ లో నే ఉత్పత్తి అవుతుందని అన్నారు.

అధికారంలోకి వచ్చీరాగానే పొరుగు దేశాలపై తారీఫ్ యుద్దం ప్రకటించిన ట్రంప్..ఆదేశాలతోపాటు అమెరికన్లను ఇబ్బందుల్లో పడేశారా అంటే..తాజా పరిస్థితులు కొంత అవుననే అంటున్నాయి. వలసవిధానాలు, రష్యా, ఉక్రెయిన్ యుద్దం శాంతి చర్చల్లో దూకుడు జోక్యం వంటి నిర్ణయాలతో ట్రంప్ తీరు ప్రపంచ దేశాలకు విసుగు పుట్టిస్తు్న్నది కొంత వాస్తవమే అనిపిస్తోంది. కెనడా మాస్ వార్నింగ్ కు ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.