
మేడ్చల్ జిల్లా: కీసర రాంపల్లి దయారా త్యాగి క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ప్రణీత్ అనే వ్యక్తి ఊపిరి ఆడక కింద పడిపోయాడు. పక్కనే ఉన్న తోటి వారు అంబులెన్స్లో చిర్యాల్ ఎక్స్ రోడ్డులో ఉన్న విజయ్ ట్రామా హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ప్రణీత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గుండె పోటు అయి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్న ప్రణీత్ కెనరా బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది. ఆదివారం ఉదయం ప్రణీత్ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడానికి త్యాగి క్రికెక్ గ్రౌండ్కి వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగానే దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
గుండె జబ్బు అనేది కరోనరీ ఆర్టరీ వ్యాధి. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటులు జీవన శైలిలో మార్పులు, వైద్యపరమైన చికిత్సలతో నివారించవచ్చు. గుండెపోటు రాగానే చాలా మందికి ఆందోళనకు గురవుతారు. దాని వల్ల కొన్నిసార్లు వారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు.. ఈ రెండు గుండెకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు. వీటిని ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు.