న్యూఢిల్లీ : కెనరా బ్యాంకు నికర లాభం జూన్ 2023 క్వార్టర్లో 75 శాతం పెరిగి రూ. 3,535 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ1 లో బ్యాంకు నికర లాభం రూ. 2,022 కోట్లు మాత్రమే. తాజా క్యూ 1 లో ఇంట్రెస్ట్ ఇన్‌కం రూ. 25,004 కోట్లకు, మొత్తం ఆదాయం రూ. 29,828 కోట్లకు పెరిగాయి. ఎసెట్ క్వాలిటీ మెరుగుపడిందని, గ్రాస్ ఎన్పీఏలు 5.15 శాతానికి, నెట్ ఎన్పీఏలు 1.57 శాతానికి తగ్గాయని కెనరా బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
బ్యాడ్ లోన్లకు ప్రొవిజనింగ్ఈ జూన్ క్వార్టర్లో రూ. 2,418 కోట్లకు తగ్గిపోయినట్లు పేర్కొంది. జూన్ 2023 నాటికి క్యాపిటల్ అడిక్వసీ రేషియో పెరిగి 16.24 శాతం వద్ద నిలిచినట్లు తెలిపింది. జీతాల పెంపుదల ఒప్పందం కోసం రూ. 344.69 కోట్లను తాజా జూన్ క్వార్టర్లో ప్రొవిజనింగ్ చేసినట్లు వివరించింది.